"బొమ్మరిల్లు" సిద్దార్ధ్ అంటే చాలు తెలుగు ఆడియన్స్ కి ఒక లవర్ బాయ్ గుర్తొస్తాడు. తర్వాత చేసిన మూవీస్ లో కూడా ఆ ఇమేజ్ కంటిన్యూ అయ్యింది. ఐతే ఇప్పుడు సరికొత్త గెటప్ తో న్యూ ట్రెండ్ కి తగ్గట్టుగా "టక్కర్" అనే మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీకి సంబందించిన ప్రొమోషన్స్ కూడా చేస్తున్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా ఒక ప్రెస్ మీట్ లో అడిగిన ఒక ప్రశ్న మీద ఫుల్ ఫైర్ అయ్యాడు. దిమ్మతిరిగే ఆన్సర్ కూడా ఇచ్చాడు. "తెలుగు ఆడియన్స్ కి మీరొక లవర్ బాయ్ అనే ముద్ర పడిపోయింది. మెంటల్ గా కూడా సిద్దార్ధ్ అంటే ఒక లవర్ బాయ్ అని ఫిక్స్ ఐపోయాం..అందుకేనేమో మీరు చేస్తున్న యాక్షన్ మూవీస్ రీచ్ కావట్లేదు. నెక్స్ట్ టైం ఏమన్నా మంచి లవ్ స్టోరీతో వద్దామనే ఆలోచన ఏమన్నా ఉందా" అని ఒక వ్యక్తి అడిగేసరికి "ఫస్ట్ ..ఈ మూవీ ఆడుతుందిరా బాబు. నువ్వు ముందే మూవీ రిజల్ట్ చెప్పమాకే...మీరు ట్రై చేసింది ఫెయిల్ అవుతుంది సర్...నెక్స్ట్ ఎప్పుడు సక్సెస్ అవుతారు సర్ అని అడుగుతున్నావ్..జూన్ 9 న ఎగ్జామ్ ఇచ్చానురా బాబు.
రిజల్ట్ వచ్చి చూడు...ముద్ర పడిపోలేదు మా. ముద్ర పడిపోవడానికి నేనేమీ రబ్బర్ స్టాంప్ ని కాదు, ఖాళీ పేపర్ ని కాదు. నేను యాక్టర్ ని. నేను నీ మీద ముద్ర పెట్టాలి. నేను నా సినిమాలో నా యాక్టింగ్ తో నీ మీద ముద్ర పెట్టాలి. సో ఈ మూవీతోనే ఆ ముద్ర కొడతాను, పెడతాను ..నెక్స్ట్ టైం నువ్వే అంటావ్...ఈ లవ్ స్టోరీస్ చెత్త ..గట్టిగా ఒక మూవీ చెయ్యి అని అడుగుతావ్. అలా అడగాలని నా కోరిక" అన్నాడు హీరో సిద్దార్ధ్. "మీరు ఈ మూవీలో ఒక లేడీ గెటప్ వేశారు కదా..దాని గురించి మీరేం చెప్తారు" అని మరో వ్యక్తి అడిగేసరికి "ముందుగా ఆ విషయాన్ని నోటీసు చేసినందుకు థాంక్స్...ఈ లేడీ గెటప్ సీన్ చేసేటప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే నా థాట్స్ అన్నీ కూడా అందరూ సమానమే అన్నట్టుగా ఉంటాయి...ఐతే ఇలాంటి సీన్ చేయమంటే చాలా మంది చేయడానికి అస్సలు ఇష్టపడరు. నేను అబ్బాయిని అమ్మాయి డ్రెస్ వేసుకోవడం ఏమిటి అంటారు. కానీ అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ కొత్తదనం ఎలా ఉంటుంది అనేది ఈ సీన్ లో చూపించారు...నేను బాగా ఎంజాయ్ చేసాను" అని చెప్పాడు సిద్దార్ధ్.